పోస్ట్‌లు

జనవరి, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

బట్టల కొట్టు

చిత్రం
మా చుట్టాలాయన ఒకాయన అంటుంటారు "బట్టల కొట్టుకి వెళ్తే కళ్ళ ఎదుట టేబుల్ మీద వంద చీరలు వేసినా, ఇవన్నీ కాదని ఆడవాళ్ళు నూట ఒకటో చీర కోసం చీరల అరలో వెతుకుతార"ట!! ఆడవాళ్ళు బట్టల కొట్టులోకి వెళ్తే ఒక పట్టాన బయటకి రారని ఎవరన్నారో కానీ, వాళ్ళు సరిగ్గా రీసెర్చి చేసైనా ఉండరు, లేక నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం కలవారైనా అయ్యుండరు. కచ్చితంగా మగవారు మాత్రం అయ్యుంటారు.  బట్టలంటే ఇష్టం లేనిది అసలు ఎవరికండీ? అసలు నన్ను అడిగండి...నిజమైన నిజాలన్నీ నిర్మొహమాటంగా, నిరభ్యంతరంగా చెప్పేయగలను. భార్య బట్టల కొట్లోకి వెళ్తే కొట్టు బైట స్కూటర్ మీద కూర్చుని ఎదురుచూసే భర్తలకి ఒకటే భయం. లోపలకి వెళ్తే వాళ్ళు ఎక్కడ tempt అయ్యి కొట్లో సగం సరుకు కోనేస్తామో అని. పైకి మాత్రం చెప్పరు. వాళ్లకి సరిగ్గా తెలిస్తేగా? కొన్ని విషయాల్లో ఆడవాళ్ళకి ఉన్నంత నిర్ణయ శక్తి, ఆత్మ నియంత్రణ మగవారికి ఉండనే ఉండవు. అందులో బట్టల కొనుగోలు ఒకటి. వీళ్ళు పదిపన్నెండు రకాలు ఎంచి చూసి, ఏడెనిమిది రకాలుగా ఆచితూచి, ఐదారు కోణాల్లో ఆలోచించి, నాలుగైదు అనుభవాలు పరిగణలోకి తీసుకుని, రెండుమూడు సలహాలు తీసుకుంటూ, చివరికి ఒకటి సెలెక్టు చేస్తారు. ...

టీచర్ గారమ్మాయ్

చిత్రం
టీచర్ల పిల్లలకి చదువు బాగా వస్తుందని ఒక టాక్ ఉంది లోకంలో. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ టీచర్ల పిల్లలకి నిజంగా వచ్చేవి ఏమిటో నాకు బాగా తెలుసు. ముఖ్యంగా ఆ పిల్లలు చదివే స్కూల్లోనే వాళ్ళ అమ్మో, నాన్నో పని చేస్తుంటే...అబ్బో...ఆ కథే వేరు. నాకూ, మా తమ్ముడికీ దగ్గరదగ్గర స్కూల్ చదువు అంతా మా అమ్మగారు పని చేసిన స్కూల్లోనే గడిచింది. అది మా ఊళ్ళో అన్నిటికన్నా గొప్ప పేరున్న స్కూల్. 40-50 మంది టీచర్లలో మా అమ్మగారు ఒక తెలుగు టీచరు. అక్కడున్నంతసేపూ ఆవిణ్ణి "Miss" అనే పిలిచేవాళ్ళం. మేము తుమ్మినా, దగ్గినా ఆవిడకి తెలిసిపోతూ ఉండేది. పరీక్ష అంత బాగా రాయని రోజున "బాగానే రాశాన"ని చెప్పేసినా, మాకు తెలిసేలోపే మా అమ్మగారికి మా మార్కులు తెలిసిపోయేవి. ఇక అల్లరి పనుల కంప్లైంటులకి అయితే హద్దూ-పద్దూ లేదు. వారానికి రెండు-మూడు సార్లైనా మాలో ఒకరి మీద ఏదో ఒక కంప్లైంట్ మా అమ్మగారిని చేరేది. మాకు బ్యాండు-బాజా ఉందని తెలిసినరోజు సాయంత్రం, ఆవిడ నడుస్తూ ఇంటికొచ్చేలోపు సైకిళ్ళ మీద మేము త్వరగా వచ్చేసి, ఎప్పుడూ చేయని పనులు చేసేసేవాళ్ళం. అంటే...కాళ్ళకి వేసుకున్నసాక్సు లాగి పారేయటం కాకుండా జాగ్రత్తగా చుట్ట...