పోస్ట్‌లు

2020లోని పోస్ట్‌లను చూపుతోంది

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

చిత్రం
మా మాజీ గృహకార్య సహాయకురాలు వెంగళమ్మ (సెక్యూరిటీ రీజన్స్ కోసం, నా ఆత్మసంరక్షణ కోసం పేరు మార్చటం జరిగింది) గురించి ఈ కథ. "గృహకార్య సహాయకురాలు" పదం కొత్తగా ఉంది కదూ? పనమ్మాయి, పనిపిల్ల, పనిమనిషి... ఇటువంటి పదాలు మనకి అలవాటు. కానీ ఇంకా మర్యాదాపూర్వకంగా ప్రస్తావించటానికి ఏ పదమైతే బాగుంటుందా అని పలుపలు విధముల ఆలోచిస్తుండగా, "అసలు ఇంగ్లీష్ లో ఏమంటారబ్బా?" అనుకున్నాను. వాడుక భాషలో "మెయిడ్" అంటారు. కానీ అందుకు సరైన అనువాదం మళ్లీ పైన చెప్పిన పదాలే. "ఇంకా ఏమంటారబ్బా?" అని ఆలోచించగా "డొమెస్టిక్ హెల్ప్" అని గుర్తొచ్చింది. దాన్ని మక్కీకి మక్కీ అనువదించలేక, ఉన్నంతలో దగ్గరగా "గృహకార్య సహాయకురాలు" అన్న పదానికి ఫిక్స్ అయ్యాను అన్నమాట. సహాయకురాలే లేకుండా ఆరేళ్ళు గడిపేశాను బాగానే. కానీ అనివార్య కారణాల వల్ల సహాయకురాలిని నియమించుకున్నాక, ఇక సహాయానికి అలవాటు పడిన ప్రాణం "లేకపోతే నీ జత పచ్చే" అనేసింది. మరి తప్పలేదు! మా ఇంట్లో అంతవరకు సహాయకురాలిగా చేసిన లక్ష్మి (అసలు పేరే, ఇక్కడ భయం లేదు కనుక) కడుపున కాయ పడటంతో (అలా ఎందుకంటారో!) పని చేయలేనం...

పండగ పెసల్

సంక్రాంతి పండగకి అంతా సొంత ఊరు   వెళ్తారని తెలుసు కానీ మరీ ఇంతమంది ఒకేసారి ఊళ్ళు ఖాళీ చేసి వలస పక్షుల్లా ఎగిరిపోతారని ఎప్పుడూ అనుకోలేదు.  సరే , నిజంగా పక్షుల్లా ఎగిరితే అసలు   సమస్యే   ఉండదు కదా ? రోడ్ల నిండా   ఇసక వేస్తే రాలనన్ని బస్సులు. అసలు ఇన్ని బస్సులు ఇన్నాళ్ళూ ఎక్కడ దాక్కున్నాయి ?! ఒక్కసారిగా తేనెపట్టు మీద ఎవరో రాయెత్తి కొడితే రేగినట్టు ఒకటే రొద , ఒకటే హడావిడి. దేశంలో ఇన్ని ప్రైవేటు బస్సు కంపెనీలు ఉన్నట్టు గానీ , ఒక్కొక్క కంపెనీకీ ఇన్నేసి బస్సుల ఆస్తి ఉన్నట్టు గానీ ఎప్పుడూ ఊహించలేదు. అసలు తెల్లవారు ఝామున ఐదింటికి వెళ్లి నుంచున్నా ' తత్కాల '  టిక్కట్లు కూడా దొరక్క గానీ , లేకపోతే ఈ తంటా ఎందుకు ? ఇది దాదాపు పది-పన్నెండేళ్ళ క్రితం మాట కదా ? అప్పట్లో ఇప్పటిలా అరచేయి కంటే పెద్దవైన ఫోన్లు , మునివేళ్ళ అంచుల్లోనే ప్రపంచాన్ని చాపలా పరిచి చూపించగల ఇంటర్నెట్టు లేవులెండి. పైగా మన ఇళ్ళలో ఉండే ఇంటర్నెట్ తో పని చకచకా జరగదని , రైల్వే బుకింగ్ కౌంటర్లో ఇంటర్నెట్ వేరేగా ఉంటుందని , టికెట్లు దొరికేస్తాయని ఎవరో హితవు పలకటంతో ఓహో అనుకున్నాము. కాకపోతే ఉదయాన్నే అయిదిం...

ఈ ఒక్కసారికీ ఇలా కానిద్దాం

ఉదయం కాఫీ తాగేసి, మా అత్తయ్యగారితో "కొంచెం టిఫిన్ ఏర్పాట్లు మీరే చేసేయండ"ని అడిగి, డాబాపైకి వచ్చి బూడిద గుమ్మడికాయ వడియాలు పెడుతున్నాను. ఎర్రటి ఎండాకాలంలోనే వడియాలు పెట్టాలని పెద్దవాళ్ళు అనటంతో పెరట్లో దానంతట అదిగా పెరిగిన పాదుకి పది కాయలు కాసి, "నన్ను వాడు, నన్ను వాడు" అని రోజూ అడుగుతున్నా, ఎండాకాలం తీవ్రరూపం దాల్చేవరకు ఆగాను. రెండు కాయలతో పెడదాం అనుకున్నా, నిన్న ఒక్క కాయని తరగటానికే మూడు నాలుగు గంటలు పట్టింది. మరి తునాతునకలు చేయాలి కదా? అందుకని రెండవ కాయకి న్యాయం చేయలేక, పూర్తిగా అన్యాయమూ చేయలేక, పొరుగింటి వాళ్ళని వడియాలు పెట్టుకోమని ప్రోత్సహించాను. నిన్న నేను తరిగిన ముక్కలను వడవేసి, పిండి రుబ్బి, కారం, ఉప్పు లాంటి రుచులు కలిపి సిద్ధం చేసి అత్తయ్యగారే ఇచ్చారు. తడి చీరపై వడియాలు పెడుతూ ఆలోచనలో పడ్డాను. అసలు ఒక కాయను బుల్లి బుల్లి ముక్కలుగా కోసి, రుబ్బిన పిండిని కలిపి ఇలా ఎండబెట్టి, దాచుకొంటే, కొన్ని నెలల తర్వాత అయినా వేడి నూనెలో వేయిస్తే పువ్వులా పొంగుతాయని ఎవరు కనిపెట్టారో కదా? మొన్నే మా స్నేహితురాలు ఒకావిడ నాలుగు కాయలతో వడియాలు పెట్టానన్నారు. నేను ఒక్కటి తర...

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

చిత్రం
నాన్నగారూ, మీకు కొద్దిరోజుల్లో షష్టిపూర్తి. గడచిన 60 ఏళ్ళను తరచి చూసుకొంటే మీరు ఎటువంటి అనుభూతిని పొందుతారో, ఎన్ని విజయాలకు వెన్ను చరుచుకుంటారో, ఏమేమి నిర్ణయాలకు ఈనాటికీ నాలుక కరచుకుంటారో, ఏమేమి జ్ఞాపకాలకు ఆనందంతో కంటతడి పెడతారో, ఏ తీపి గుర్తులకు చిరుమందహాసం చిందిస్తారో గానీ, నేను నా మదిలో ముచ్చట్లను మీకు చెప్తాను ఈ సందర్భంగా. మీ గతంలో నా ముచ్చట్లేమిటి అంటారా? 60 లో మొదటి 26 తీసేయగా మిగతా 34 ఏళ్ళ ప్రయాణంలో నేనూ ఉన్నాను మరి. అది చాలదూ? 34 సంవత్సరాల పరిచయంలో మీ పట్ల నాకు చాలా అసంతృప్తులు ఉన్నాయి. 10 కంప్లెయింట్లు ఉన్నాయి. అవి ఈరోజు మీకు వెళ్ళబోసుకోవాలని నిర్ణయానికి వచ్చేశాను. వినక తప్పదు మీకు. 1) మీరు నాచేత రోజూ ఊరు ప్రయాణం చేయించేవారు నా తొమ్మిదేళ్ళ వయసు లోపు  మనమున్న ఊరిలో లైబ్రరీ లేదని పక్కనున్న పెద్ద ఊరికి సైకిల్ తొక్కుకుంటూ తీసుకువెళ్ళేవారు. మీరు పేపర్ చదువుతూ కూర్చొనేవారు. నాకు ఏ పుస్తకం కావాలంటే అది చదువుకోమనేవారు. మళ్లీ వెనక్కి సైకిల్ తొక్కుకుంటూ వచ్చే దారిలో నేనేం చదివానో ఆ కథ చెప్పమనేవారు. దీనితో నాకు reading habit అలవడటం మాత్రమే కాక, జ్ఞాపకశక్తి, ధారణా ...