పోస్ట్‌లు

2019లోని పోస్ట్‌లను చూపుతోంది

పునఃదర్శన ప్రాప్తి ఈనాటికి ఇలా

ఏమిటా ముఖాలు? ఈ బ్లాగ్ కి నేనెప్పుడు సబ్ స్క్రైబ్ అయ్యానా అని అర్థం కాక చూస్తున్నారా? బాబర్ తన మనవడు అక్బర్ కి పట్టాభిషేకం చేయటానికి ఏర్పాట్లు చేయమని రాజోద్యోగులకు పనులు పురమాయించిన రోజుల్లో ఒక బలహీన క్షణంలో మీరే మీ టైమ్ బాగోక ఆ సబ్ స్క్రైబ్ అనే మీటని నొక్కారులే. అది... అదే అదే... మీకు గుర్తొచ్చింది కరక్టే. నేను నేనే. బాగానే పనిచేస్తోంది మీ జ్ఞాపకశక్తి. గోడమీద పుస్తకం పెట్టి, రాయటానికి ప్రయత్నించి, గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇంకు మరోవైపుకి పాకిపోగా రాయటం మానేసిన రీఫిల్ ఉన్న పెన్నుని దులిపి దులిపి, రాసేలా చేసుకొని, పట్టుదల అనే బూజుకర్రతో ఇన్నాళ్ళూ అటక మీదున్న ఈ బ్లాగుని దించి, దీనికి పట్టిన బూజుని ఈరోజు దులిపేయాలని నిర్ణయించేసుకున్నాను. ఈపాటికి ఈ దుమ్ముకి మీకు తుమ్ములు వస్తూ ఉండాలే? ఏం కంగారు పడకండి. అవసరమయితే ఆ రెండు తుమ్ములూ తుమ్మేసి మళ్లీ ఇది చదవటం మొదలుపెట్టండి. మధ్యాహ్నం రమారమి మూడు గంటల సమయం. ఉల్లికారం కూరిన గుత్తివంకాయ కూర, చుక్కకూర పచ్చడి, వేడి వేడి చారు, కమ్మటి పెరుగు కలుపుకొని తిన్న అరగంటకి... "ఇంకా ఏం కూర్చుంటావులే, ఇక నిద్రలోకి జారుకో"మని కళ్ళు, ఒళ్...