పోస్ట్‌లు

2021లోని పోస్ట్‌లను చూపుతోంది

మా మల్లి బాబాయ్

చిత్రం
బాబాయ్ అంటే చిన్నతండ్రి, తండ్రి తర్వాత తండ్రి అంటారు. కానీ మా మల్లి బాబాయ్ 'అంతకు మించి'. మా అందరికీ తండ్రే కాదు, ఒక స్నేహితుడు, ఒక గురువు, ఒక మార్గ నిర్దేశకుడు, ఒక అన్నయ్య. మా అమ్మకి నా మీద బోలెడంత కోపం వచ్చేసినప్పుడు, ఆ సిట్యుయేషన్ ని తేలిక చేయటానికి తెలుగులోకి డబ్బింగ్ అయిన సినిమాల్లో పాటలకి సాహిత్యంతో సంబంధం లేకుండా నటుల నోటి కదలికలు ఎలా ఉంటాయో చెప్పి చెప్పి అందరినీ నవ్వించినా మల్లి బాబాయే. "మ్రేప సోకమే లవలో డపిన పంపా సిపడువా" (ప్రేమ కోసమే వలలో పడెనే పాపం పసివాడు) అంటూ పాటల్ని తిరగేసి పాడినా, "హిల్ విలేజ్ కింగు హార్టు లుక్కరా బులక్కు ఓ బులక్కు" (కొండవీటి రాజా గుండె చూడరా) అంటూ తెలుగు పాటకి ఇంగ్లీషు రూపం ఇచ్చినా, మాయాబజార్ లో లంబుజంబులు మాటల్ని పొడి చేసి పిప్పి చేసినట్టుగా పాటల్ని తూట్లు పొడిచేసి, పొడి చేసి, పిప్పి చేసి పెట్టి పిల్లలమైన మా అందరినీ పడి పడి నవ్వించినా మల్లి బాబాయే. "ఈపాదం పుణ్యపాదం ....., నమో వేంకటేశా .... పాటలకి అనుకరణని అడిగి అడిగి చేయించుకుని, పడీపడీ నవ్వి, నవ్వలేక పొట్టలు పట్టుకునేవాళ్ళం. ఆ సందడికి, ఆనందానికీ కారణమైనా మల్లి బాబయ్...

ముప్ఫై ఏళ్ళ తర్వాత మళ్లీ... (క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి - 1వ భాగం)

"ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి" అని మాటల మాంత్రికుడు గారు అన్నారు కదా? ఏమిటో, నేను ఎక్కువసేపు పడుకున్నా, కాసేపే పడుకున్నా, కలలు వస్తాయి, అవి బాగా గుర్తుంటాయి కూడా. కలలు వస్తే, అవి గుర్తుంటే, అది సరైన నిద్రే కాదని డాక్టర్ల ఉవాచ. అంటే, "నీకేదీ చేత కాదు" అని ఎవరైనా నన్ను గట్టిగా తిడితే, ఆ చేతకాని పనుల జాబితాలో "సరిగ్గా నిద్రపోవటం" కూడా ఉందన్నమాట! ఇంతకీ అలా నాకు వచ్చే కలల కేటగిరీల్లో బాగా తరచుగా వచ్చేది "పరీక్షలు". సదరు "చదువుకొనుట" అనబడే పూర్వాశ్రమం ముగిసి 14-15 ఏళ్ళు కావస్తున్నా, "పరీక్షలు రాయుట" అనే బృహత్ కార్యక్రమం నిర్వహించుట అప్పటి నుండి ఒక్కసారీ జరగకపోయినా, ఆ కలలు నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి ఎందుకో! అందులోనూ మళ్లీ రకాలు ఉన్నాయండోయ్! ఒకోసారి పరీక్షలకి ఏమీ చదవనట్టు, ఇంకాసేపట్లో పరీక్ష అనగా ఆ విషయం నేను తెలుసుకున్నట్టు వస్తుంది. లేకపోతే పరీక్షకి ఆలస్యం అయిపోతున్నట్టు, ఎంత ఫాస్ట్ గా తొక్కుతున్నా సైకిల్ కదలనట్లు వస్తుంది. కలలోనే కాక బయట కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాను. ఒకోసారి కలల్లో తెగ ప్రిపేర్ అయిపోతూ ఉంటాను. స్టెప్పులు...

ఆది గురువు

చిత్రం
ఈ రోజు గురుపూర్ణిమ. ప్రతి ఏటా ఈరోజున నాకిష్టమైన గురువులను తలచుకోవటం నాకు అలవాటు. వారితో మాట్లాడే అవకాశం లేకపోయినా, కనీసం వాళ్ళతో కూడి ఉన్న జ్ఞాపకాల్లో గడుపుతుంటాను. చిన్న క్లాసుల్లో మెరీనా సిస్టర్, కొంచెం పెద్ద క్లాసుల్లో లక్ష్మి మిస్, తులసి మిస్ (మిసెస్ లే అయినా ఎందుకో మా స్కూల్లో టీచర్లనందరినీ మిస్ అని పిలిచేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు అలా అనకూడదని తెలిసినా, ఆ అలవాటుని మార్చుకొని "లక్ష్మి మేడమ్", "తులసి టీచర్" అనలేను. ఎందుకంటే ఆ రూపానికి ఆ పేరు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మార్చి పిలిస్తే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది), తర్వాత ఇంటర్ లో శంకరశాస్త్రి గారు, ట్యూషన్ చెప్పిన వరలక్ష్మి మిస్, మల్లేశ్ సర్... వీళ్ళంతా మనసులో ముద్ర పడిపోయేలా పాఠం చెప్పటమే కాక, నా వ్యక్తిత్త్వ వికాసంలో కూడా గొప్ప పాత్ర పోషించినవారే. సగటున ఏడాదికి కనీసం ఐదారుగురు గురువులు చొప్పున మన చదువు పూర్తి అయ్యేలోగా కనీసం 15 ఐదులు 75 మంది గురువులు మనకి చదువు చెప్పి ఉంటారు. వీరు కాక ఆర్ట్స్, స్పోర్ట్స్ లాంటివి నేర్పినవారు, మాథ్స్, ఇంగ్లీష్ లాంటి ట్యూషన్లు చెప్పి మన చదువు స్థాయిని పెంచినవారు ఉండనే ఉన్నారు... అందర...