మా వఫ్రహో కథ
కోవిడ్ శకంలో మొగుళ్ళు ఇంట్లో కూర్చొని పనిచేయటంవల్ల పెళ్ళాలని అవీ ఇవీ వండిపెట్టమని కాల్చుకుతింటున్నారంటూ వచ్చిన జోకులతోనూ, ఇంట్లో పెళ్ళాంబిడ్డల గోల ఎక్కువై పని సరిగ్గా చేసుకోలేకపోతున్నామంటున్న మొగుళ్ళ గోడు గురించి వచ్చిన కార్టూన్లతోనూ, "ఆఁ.. ఎవరికి కనిపిస్తుందిలెద్దూ" అంటూ మీటింగులున్న కాసేపూ పైన ఆఫీసు చొక్కాలూ టైలూ ధరించి కింద లుంగీలో నిక్కర్లో వేసుకున్న ఫోటోలతోనూ, చిన్నప్పుడు స్కూలుకి ఎగనామం పెట్టటంవల్ల కర్మ ప్రతిఘటించి ఇప్పుడు పెద్దలు వాళ్ళ పిల్లలతో కలసి కూర్చొని పాఠాలు వింటున్నారంటూ వచ్చిన సెటైర్లతోనూ, మొగుడూపెళ్ళాల మధ్య, తల్లిదండ్రులకీ-పిల్లలకీ మధ్య ఎదురైన ఇబ్బందుల్ని, తప్పని తిప్పల్ని ఉప్పుకారాలు, మసాలాలు జోడించి చూపించిన షార్ట్ ఫిలిమ్స్ తోనూ సోషల్ మీడియాను శుభ్రంగా క్రియేటివిటీలో నానపెట్టి ముంచిలేపారు మనవాళ్ళంతా. అయితే మా ఇల్లు ఈ నూతనత్వానికి మినహాయింపు. అంటే అర్థం ఇవన్నీ మా ఇంట్లో జరగలేదని కాదు. కోవిడ్ శకానికీ మాకూ సంబంధం లేదని, అంతకంటే ముందునుంచే ఇవన్నీ మేము చూసేశామని. కోవిడ్ పుట్టుకకి దాదాపు రెండేళ్ళ ముందునుంచే మా శ్రీవారు 'వర్క్ ఫ్రం హోం' చేశారు కనుక. ఓ ప్రా...