పోస్ట్‌లు

2012లోని పోస్ట్‌లను చూపుతోంది

కాగితం చూసి...

కొన్ని జ్ఞాపకాలు రాగానే మనలో మనం ముసిముసిగా నవ్వుకుంటాం. కొన్నిటికి మనసులో అలజడి కలుగుతుంది. కొన్ని గుర్తురాగానే "చ...అలా ఎందుకు జరిగిందిరా బాబూ? నేను ఆ పని చేస్తే బాగుండేది" అనిపిస్తుంది. కొన్ని గుర్తొస్తే మన మీద మనకే చిరుకోపం వస్తుంది. కొన్నిటికైతే సిగ్గుతో తల దానంతట అదే దిగిపోతుంది. నాకు ఇవన్నీ ఒకేసారి కలిసి వచ్చేస్తాయి ఒక విషయం గుర్తొస్తే. అప్పుడు ఎంత వర్ణనాతీతమైన ఫీలింగ్ వస్తుందంటే...ఒక టైం మెషిన్ దొరికితే, ఎంత డబ్బులు కర్చు పెట్టైనా సరే, దాని టికెట్ కొనేసి ఒక పదహారు సంవత్సరాలు గిర్రున వెనక్కి వెళ్ళిపోయి, ఒక బటన్ నొక్కేసి అంతా మార్చేయాలి అనిపిస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు టైం మెషిన్ తయారు చేసేది ఎవరు? నాకు టికెట్ అమ్మేది ఎవరు? నా చిన్నతనంలో, మేము పెదపాడులో ఉండే రోజుల్లో మా నాన్నగారు దసరాలకి చింతలపూడి వెళ్లి వస్తూ ఉండేవారు. అక్కడ విశ్వనాథ మఠం అనే ఒక ఆశ్రమంలో పండగ కార్యక్రమాల్లో భాగంగా ఉపన్యాసాలూ, ప్రదర్శనలూ ఏర్పాటు చేసేవారు. అందులో మా నాన్నగారి ఉపన్యాసం ప్రతిరోజూ ఉండేది. అలా ఒక ఏడాది మా నాన్నగారితో మేమందరం వెళ్ళాము. ఆ ఏడు దసరాకి మా నాన్నగారి గురువుగార...