ఇదీ అసలు కథ
కృత యుగంలో అమృతం కోసం దేవతలు క్షీర సాగర మథనం చేయటానికి తలపెట్టారట. వాళ్ళ ఒక్కరి వల్లా కాక రాక్షసుల సహాయం అడిగారట. వాసుకి అనే పాము, మంధర పర్వతం, కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తి సహాయంతో పని మొదలు పెట్టారట. ఆ ప్రయత్నంలో చివరకి అమృతం పుట్టిందిట. అది మాకూ కావాలని గొడవపెట్టిన రాక్షసులని మోహిని రూపంలో వచ్చిన విష్ణుమూర్తి మాయ చేసి, దేవతలకి అమృతాన్ని అచ్చంగా ఇచ్చేశారట. మాయకు లోనైన దానవులూ సంతృప్తి పడి ఇంటి దారి పట్టారట. ఇదంతా మౌనంగా చూసిన మనుషులు ఒక మీటింగ్ పెట్టుకున్నారట. అంతా అయ్యాక ఒక ప్రతినిధిని ఎన్నుకుని విష్ణుమూర్తి దగ్గరకు పంపారట. సినిమాల్లో చూపించే యూనియన్ లీడర్ లాగా ఆ 'మనిషి' రెండు పిడికిళ్ళూ విడివిడిగా బిగించి, కళ్ళలో పట్టుదలతో, మనసు నిండా కర్తవ్య దీక్షతో విష్ణువు దగ్గరకు వెళ్ళాడుట. "స్వామీ! రాక్షసులు అంటే విలన్లు కనుక మాయ చేసేశావ్. దేవతలు హీరోలు కనుక బాగానే అమృతం ముట్టజెప్పావ్. మరి నీ నాటకంలో 'supporting cast' చేస్తున్న మేము ఏం తప్పు చేశాము? మాకూ కాస్త ఇస్తే నీ సొమ్ము ఏం పొయిందయ్యా?" అని మనసులోని మాట విన్నవించుకున్నాడట. విష్ణుమూర్తి ఎప్పటిలాగే ఒక చిన్న నవ...