పోస్ట్‌లు

మార్చి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

ద బోల్డ్ అండ్ బ్యూటిఫుల్

     బాలాత్రిపురసుందరీమహాలక్ష్మిగారు... మా నాన్నమ్మ. చంద్రబింబంలాంటి కళ, సూర్యబింబంలాంటి కాంతి తన సొంతం. ఊరికి కొత్తకోడలిగా వచ్చినప్పుడు హీరోయిన్ అంజలీదేవి వచ్చిందని ఊళ్ళోవాళ్ళు చెప్పుకున్నారట. ఏ రంగు చీర కడితే ఆ రంగుకే అందం వచ్చిందా అన్నంత కళకళలాడే వర్చస్సు. శుచి-శుభ్రతకి పెద్దపీట వేసేది. చివరి రోజుల్లో కూడా కడిగిన ముత్యంలా మెరిసేది.      ఖంగుమనే కంఠస్వరం. ఆరుగురు పిల్లలతో తాతగారు ఏడో పిల్లవాడిలా ఆటపాటలు, అల్లరివేషాలు వేసేవారట. ఆయనతో ఫ్రెండ్ లా మెలిగిన వాళ్ళు నాన్నమ్మ కంటిచూపుకి కూడా గడగడలాడేవారట. సినిమాల్లో భానుమతిలాగా "ఖడేరావ్" అందంటే దడదడలాడుతూ అంతా వరుసలో నుంచోవాల్సిందే.     పిల్లలకైనా, మనవలకైనా పధ్ధతిలో ఆవిడదే స్ఫూర్తి, ప్రేమను పంచే విషయంలో అంతకుమించిన అమృతమూర్తి. ప్రతి తల్లీ తన కడుపున పుట్టిన పిల్లల్ని ఆస్తిపాస్తులకంటే ఎక్కువగా భావిస్తుంది. కానీ ఆ విషయంలో మా నాన్నమ్మది ఇంకొంచెం ఎక్కువ స్థాయి అనురాగం అనిపిస్తుంది నాకు. ఆరుగురు పిల్లలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవలు, మునిమనవలు, ఇనిమనవలు ఎంతమంది తన పరివారంలోకి చేరినా, అందులోని ప్రతి ఒక్కరికీ సమానస...