అన్ని రోడ్లూ అక్కడెక్కడికో చేరుతాయటగా?
అన్ని రోడ్లూ రోము నగరానికే చేరిపోవటం మాట ఎలా ఉన్నా, రోడ్లపై ఎడ్రస్సులు వెతికి పట్టుకోవటం ఒక చాలెంజ్ అనే చెప్పాలి. అమెరికా లాంటి దేశాల్లో కొత్త ఎడ్రస్ తెలుసుకోవటం కష్టం అంటారు కొందరు, సులభం అంటారు మరికొందరు. బాగా కొత్తగా అమెరికాకి వచ్చిన వాళ్ళు జీపీయస్ ని చుసి, "ఇది భలే ఉంది. మన దేశం ఇలా ఎప్పటికి అవుతుందో" అనుకుంటారు. కొంత కాలం ఉన్న వాళు దానికి బాగా అలవాటు పడతారు. ఇంకా చాన్నాళ్ళు ఉన్నవాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళతో "జీపీయస్ కి అలవాటు పడకండి. మ్యాప్స్ చూడండి, జ్ఞ్యాపకం పెట్టుకోండి" అని హితబోధ చేస్తారు. ఇది మనందరం చూసే ఉంటాం. మన దేశం లో మాత్రం కొత్త ప్రదేశాలకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు దారి వెతికి పట్టుకోవటం ఎంత సులభమో అంతే కష్టం. ఈ సందర్భంలో ఒక సంఘటన చెప్పాలి. ఒకసారి ఒక కార్యక్రమానికి వెళ్ళటం కోసం హైదరాబాద్ లో పెద్దగా పరిచయం లేని ఒక ప్రదేశానికి వెళ్ళాను. బస్ లో అక్కడ వరకు చేరాక, ముందుగా అనుకున్న ప్రకారం అక్కడ నేనూ మా తమ్ముడూ కలుసుకున్నాం. తనకీ ఆ ప్రాంతం కొత్తే కావటం తో, అదివరకు ఎప్పుడో ఒకసారి వెళ్ళిన నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. నేను తన బైక్ ఎక్కి కూర్చుని నా జ్ఞ్యా...