పోస్ట్‌లు

నటవిశ్వరూపం - నవ గౌరవం (క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి - 3వ భాగం)

  "క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి" శీర్షికలోని మొదటి టపాలో కూతురి బడికోసం పడ్డ పాట్లు, ఎల్కేజీలో జరిగిన ఆన్లైన్ క్లాసుల గురించి కబుర్లు చెప్పుకున్నాం.   https://madilomucchatlu.blogspot.com/2021/09/blog-post.html ముప్ఫై ఏళ్ళ తర్వాత మళ్లీ... (క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి - 1వ భాగం) రెండవ టపాలో యూకేజీలో మొదటిసారి బడి అనుభవాలు, కూచిపూడి రుచి తెలుసుకున్నాం. https://madilomucchatlu.blogspot.com/2022/05/2.html కాస్తంత బడి - కూస్తంత కూచిపూడి (క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి - 2వ భాగం) ఇది మూడవ భాగం. ఇప్పుడు 2013 మార్చి. మా అమ్మాయి ఒకటవ క్లాస్ లో ఉంది.           ఆరో పుట్టినరోజు కేకు రుచి చూసిందో లేదో, మా అమ్మాయి ప్రవర్తన ఉన్నట్టుండి మారిపోయింది. అంతవరకు పిల్ల చేష్టలు, పిల్ల హావభావాలు, పిల్ల అలవాట్లు ఉండేవా? ఉన్నట్టుండి గంటకొట్టినట్టు పెద్దపిల్లలా ప్రవర్తించటం మొదలుపెట్టేసింది! మన మాటల్లో పాలుపంచుకొనే ప్రయత్నాలు, ఇంట్లో అందరికీ సాయం చేసేయాలని తాపత్రయం, తన పనులు తనే చేసుకోగలగటం, కొన్ని చేసుకోలేకపోయినా "చేసేయగలను" అనేసుకోవటం, ఏమైనా అంటే చిన్నబుచ్చుకోవటం, మన...

తోచీ తోచనమ్మ

   "తోచీతోచనమ్మ తోటికోడలి పుట్టింటికి వెళ్లింది" అన్న సామెత ఒకప్పటి కాలంలో. ఇప్పుడు అలా వెళ్ళటాలు మామూలే. పైగా స్మార్ట్ ఫోన్లు ఒకచేత్తో మనుషుల్ని దగ్గర చేస్తూనే మరోచేత్తో దూరంచేస్తున్న ఈ కాలంలో ఒకరింటికి ఒకరు వెళ్ళటం అనేది చాలా అరుదైన, ముచ్చటైన విషయం కూడాను.      అసలు నేను చెప్పాలనుకున్నది నా తోచీతోచనమ్మతనం గురించి.  ఈమధ్య నేను తోచీతోచనట్టే ఒక పెళ్లికి వెళ్ళొచ్చాను.      ఛండీఘర్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మా పెద్ద మేనమామగారికి బాగా బంధుప్రీతి. అలాంటిలాంటి బంధుప్రీతి కాదు, మా చెడ్డ బంధుప్రీతి. బ్రహ్మోత్సవం సినిమా ద్వితీయార్థంలో మహేశ్ బాబుకి ఉండే అంత.      ఒక వేలే కాదు, రెండు మూడు వేళ్ళు విడిచిన బంధువుల్ని కూడా కలుసుకొని, కలుపుకుంటూ ఉంటాడు. అలా అన్ని వేళ్ళనూ కలిపి ఉంచే బాధ్యతని తన భుజస్కంధాలమీద వేసుకొని మోసే మా మావయ్య హైదరాబాద్ లో ఒక పెళ్లికి హాజరయ్యాడు.      ఆమధ్యనే సతీసమేతంగా తీర్థయాత్రలు చేయటంతో, కొద్దిగా బదరీనాథ్ ప్రసాదాన్ని మాకు అందజేయాలనుకున్నారు. దానితోపాటే, స్వయంగా నారుపోసి, నీరుపోసి పెంచిన ఉసిరిచెట...

హనీ హార్ట్స్ - పాత హనీ కాదు సుమా, కొత్త హనీ!

     అందరికీ మంగిడీలు. ఎప్పటినుంచో అనుకుంటున్నాను సినిమాల మీద మీతో కబుర్లు చెప్పాలని. ఒకోసారి బాగా నవ్వొచ్చినవి, కాస్తో కూస్తో గుండెని కదిలించేవి చూసినప్పుడు దానిగురించి రాయాలి అనుకునేదాన్ని. ఒకోసారి తలబాదుకుంటూ, నా ఒక్కదాని తలే ఎందుకు బొప్పి కట్టాలి, మీది ఎందుకు కట్టకూడదు అన్న కుళ్ళుతో రాసేద్దాం అనుకునేదాన్ని. ఎప్పుడూ కూర్చొని రాయటానికి మాత్రం ముహూర్తం కుదిరింది కాదు. ఈరోజు ఇక నన్ను పంచభూతాలు కూడా ఆపలేకపోతున్నాయి. నేను చూసిన చిత్రరాజం అలాంటిది మరి.      మొన్న మాకు ఒక పాత సినిమా పాట గుర్తొచ్చింది. కానీ ఆ పాట ఇంకేదో సినిమాలోది అనుకున్నాము. ఆ మర్నాడు ఆ పాట కోసం ఆ సినిమా పెట్టుకున్నాము. మా అదృష్టం పుచ్చి, అదే పేరుతో ఒక కొత్త సినిమా కూడా ఉంది. అంటే సరికొత్తది కాదులే కానీ, ఆ పాతదానికంటే ఒక 22 ఏళ్ళ తర్వాత వచ్చినది. ఇందాక అనుకున్నట్టు మా అదృష్టం పుచ్చటం వల్ల ఆ రెండిటిలోనూ హీరో కూడా ఒకతనే. మేము 2023 లో చూసినది 1965 ది కాక 1987 ది అన్నమాట. 1965 నాటిది తెలుగులో విడుదల అయ్యి ఘనవిజయం సాధించాక దాన్ని హిందీలో తీశారు. 1987 నాటిది హిందీలో విజయం సాధించగా తెలుగులోకి తేబడ్డ చ...

ద బోల్డ్ అండ్ బ్యూటిఫుల్

     బాలాత్రిపురసుందరీమహాలక్ష్మిగారు... మా నాన్నమ్మ. చంద్రబింబంలాంటి కళ, సూర్యబింబంలాంటి కాంతి తన సొంతం. ఊరికి కొత్తకోడలిగా వచ్చినప్పుడు హీరోయిన్ అంజలీదేవి వచ్చిందని ఊళ్ళోవాళ్ళు చెప్పుకున్నారట. ఏ రంగు చీర కడితే ఆ రంగుకే అందం వచ్చిందా అన్నంత కళకళలాడే వర్చస్సు. శుచి-శుభ్రతకి పెద్దపీట వేసేది. చివరి రోజుల్లో కూడా కడిగిన ముత్యంలా మెరిసేది.      ఖంగుమనే కంఠస్వరం. ఆరుగురు పిల్లలతో తాతగారు ఏడో పిల్లవాడిలా ఆటపాటలు, అల్లరివేషాలు వేసేవారట. ఆయనతో ఫ్రెండ్ లా మెలిగిన వాళ్ళు నాన్నమ్మ కంటిచూపుకి కూడా గడగడలాడేవారట. సినిమాల్లో భానుమతిలాగా "ఖడేరావ్" అందంటే దడదడలాడుతూ అంతా వరుసలో నుంచోవాల్సిందే.     పిల్లలకైనా, మనవలకైనా పధ్ధతిలో ఆవిడదే స్ఫూర్తి, ప్రేమను పంచే విషయంలో అంతకుమించిన అమృతమూర్తి. ప్రతి తల్లీ తన కడుపున పుట్టిన పిల్లల్ని ఆస్తిపాస్తులకంటే ఎక్కువగా భావిస్తుంది. కానీ ఆ విషయంలో మా నాన్నమ్మది ఇంకొంచెం ఎక్కువ స్థాయి అనురాగం అనిపిస్తుంది నాకు. ఆరుగురు పిల్లలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవలు, మునిమనవలు, ఇనిమనవలు ఎంతమంది తన పరివారంలోకి చేరినా, అందులోని ప్రతి ఒక్కరికీ సమానస...

మా వఫ్రహో కథ

కోవిడ్ శకంలో మొగుళ్ళు ఇంట్లో కూర్చొని పనిచేయటంవల్ల పెళ్ళాలని అవీ ఇవీ వండిపెట్టమని కాల్చుకుతింటున్నారంటూ వచ్చిన జోకులతోనూ, ఇంట్లో పెళ్ళాంబిడ్డల గోల ఎక్కువై పని సరిగ్గా చేసుకోలేకపోతున్నామంటున్న మొగుళ్ళ గోడు గురించి వచ్చిన కార్టూన్లతోనూ, "ఆఁ.. ఎవరికి కనిపిస్తుందిలెద్దూ" అంటూ మీటింగులున్న కాసేపూ పైన ఆఫీసు చొక్కాలూ టైలూ ధరించి కింద లుంగీలో నిక్కర్లో వేసుకున్న ఫోటోలతోనూ, చిన్నప్పుడు స్కూలుకి ఎగనామం పెట్టటంవల్ల కర్మ ప్రతిఘటించి ఇప్పుడు పెద్దలు వాళ్ళ పిల్లలతో కలసి కూర్చొని పాఠాలు వింటున్నారంటూ వచ్చిన సెటైర్లతోనూ, మొగుడూపెళ్ళాల మధ్య, తల్లిదండ్రులకీ-పిల్లలకీ మధ్య ఎదురైన ఇబ్బందుల్ని, తప్పని తిప్పల్ని ఉప్పుకారాలు, మసాలాలు జోడించి చూపించిన షార్ట్ ఫిలిమ్స్ తోనూ సోషల్ మీడియాను శుభ్రంగా క్రియేటివిటీలో నానపెట్టి ముంచిలేపారు మనవాళ్ళంతా. అయితే మా ఇల్లు ఈ నూతనత్వానికి మినహాయింపు. అంటే అర్థం ఇవన్నీ మా ఇంట్లో జరగలేదని కాదు. కోవిడ్ శకానికీ మాకూ సంబంధం లేదని, అంతకంటే ముందునుంచే ఇవన్నీ మేము చూసేశామని. కోవిడ్ పుట్టుకకి దాదాపు రెండేళ్ళ ముందునుంచే మా శ్రీవారు 'వర్క్ ఫ్రం హోం' చేశారు కనుక. ఓ ప్రా...

ముక్కు పురాణం

 మీరు చదివింది కరక్టే. అదే దీని టైటిల్. గతంలో ముగ్గు కబుర్లు చెప్పుకున్నాం కదా? ఈసారి ముక్కు కబుర్లు చెప్పుకుందాం. ఏమిటి, మీరు ముగ్గు కబుర్లు మిస్సయ్యారా? అయితే ఇదిగో లంకె. https://madilomucchatlu.blogspot.com/2020/05/blog-post.html      సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కానీ నన్నడిగితే కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు కంటే ముక్కు మరీ ప్రధానం. అన్నం లేకుండా ఒక రెండు రోజులు ఉండచ్చు, నీళ్ళు లేకుండా ఒక పూట ఉండచ్చు, నిద్ర లేకుండా ఒక రోజు ఉండచ్చు. కానీ కరడుగట్టిన యోగ ఉపాసకులు కూడా గాలి పీల్చకుండా  గట్టిగా పావుగంట కూడా ఉండలేరు కదా? మరి ఆ గాలి పీల్చటానికి ముక్కు మహా ఇంపార్టెంటు అవునా కాదా?      రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు పెదవులు, రెండు కాళ్ళు, రెండు చేతులు ఇచ్చిన దేవుడు ఒకే ఒక్క ముక్కునిచ్చాడు. ఇప్పుడు రెండు ముక్కులున్న ముఖాన్ని ఊహించుకోకండోయ్, తట్టుకోలేరు. కళ్ళు రెండిచ్చి, చూపు ఒకటేనన్నాడు. చెవులు రెండిచ్చి వినేది ఒకటేనన్నాడు. కాళ్ళు రెండిచ్చి నడక ఒకటేనన్నాడు, చేతులు రెండిచ్చి చేత ఒకటేనన్నాడు. కానీ ముక్కు ముచ్చటగా ఒక్కటంటే ఒక్కటిచ్చి, ఆ మ...

హ్యాండ్ బ్యాగ్

     ఆడవాళ్ళు హ్యాండ్ బ్యాగ్ ఎందుకు వాడతారు అనే అంశం మీద ఎన్నో కథలు, ఎన్నో జోకులు, ఎన్నో హాస్య వ్యాసాలు ఉన్నాయి. బరువు-బాధ్యత అనే ద్వంద్వ సమాసం మొట్టమొదట ఎక్కడ పుట్టిందో గానీ, అది హ్యాండ్ బ్యాగ్ కి నిర్వచనంగా సరిగ్గా సరిపోతుంది.     కానీ అది ఆడవాళ్ళకి మాత్రమే భూషణం ఎందుకు అయ్యింది? ఇదొక సమాధానం లేని చిక్కుప్రశ్న.  రెండుమూడేళ్ళ వయసున్న ఆడపిల్లలు కూడా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని స్టైల్ గా తిరగాలని తాపత్రయపడుతుంటారు. కాసేపటికి ఆటల మీదకి ధ్యాస మళ్ళాక ఆ బ్యాగ్ ని కూడా అమ్మ మొహాన పడేస్తారనుకోండి. అలా తమ మొహాన పడేయబడ్డ ఎన్నో వస్తువులను హ్యాండ్ బ్యాగ్ లో కుక్కుకొని, ఏ ఆకారంలో ఉన్నదైనా అది కొబ్బరిబొండం షేపులోకి మారిపోయి, తగిలించుకున్న చోట ఇక చోటు లేక జారిపోతూ, భుజాన బరువై ఇబ్బంది పెడుతున్నా, మొగుడు కట్టిన మంగళసూత్రంతో సమానంగా దాన్ని అదిమి జాగ్రత్తగా పట్టుకొని ఇల్లు చేరుతారు ఆడవాళ్ళు. మొన్నొక రోజున నా బ్యాగ్ అలాగే బోలెడంత బరువుగా అనిపించి, ఒక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాను.      ఇలాగే మా పెళ్ళైన ఏడాది ఒకరోజు అంతకంతకీ నా హ్యాండ్ బ్యాగ్ బరువైపోతోందని గమనించాను....

కాస్తంత బడి - కూస్తంత కూచిపూడి (క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి - 2వ భాగం)

     "క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి" అనే శీర్షికలో మొదటి భాగం పుట్టేసరికి అసలు ఈ శీర్షిక పుట్టనేలేదు. ఆ మొదటి టపా లో నా కుమారీమణి/ కూతురులక్ష్మి గురించి రాసిన వివరాలకు తన వీరాభిమానుల స్పందనను చూశాక, నాలాంటి తల్లులు ఎలా తమ తమ అనుభవాలను నెమరు వేసుకున్నారో చూశాక, ఈ పేరుతో శీర్షికను సృష్టించక తప్పలేదు. "క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి" మొదటి టపా మీకు అంది ఉండకపోతే, ఇదిగో, ఇదే దానికి లంకె... https://madilomucchatlu.blogspot.com/2021/09/blog-post.html      ఇకపోతే, మా కూతురులక్ష్మి దయవల్ల ఈమధ్యనే నేను అఖిల భారత అరివీర భయంకర ఎల్కేజీ ఫైనల్ పరీక్షల్లో గట్టెక్కాను. ఈ ప్రెపరేషన్ ఏదో నా ఎంసెట్ ఎగ్జామ్ కో, ఇంకా ఏ ఐఐటీ పరీక్షలకో అయ్యుంటే, ఈపాటికి ఎక్కడో ఉండేదాన్ని, ఇక్కడైతే కాదు! మొదటి టపాలో ప్రస్తావించినట్టు సామ-దాన-భేద-దండోపాయాలు వాడుతూ, తనకి రాయటమంటే మహా ప్రీతి అని మా పిల్లని హిప్నొటైజ్ చేస్తూ మొత్తం మీద కొద్దో గొప్పో రాయించగలుగుతున్నాను. తన ఎల్కేజీ టీచర్ పుణ్యమో, నా అదృష్టమో, ఒక 100 వరకు అంకెలు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి రాయటం, దాటుడు అంకెల మధ్యలో ఖాళీలు నిం...

మా మల్లి బాబాయ్

చిత్రం
బాబాయ్ అంటే చిన్నతండ్రి, తండ్రి తర్వాత తండ్రి అంటారు. కానీ మా మల్లి బాబాయ్ 'అంతకు మించి'. మా అందరికీ తండ్రే కాదు, ఒక స్నేహితుడు, ఒక గురువు, ఒక మార్గ నిర్దేశకుడు, ఒక అన్నయ్య. మా అమ్మకి నా మీద బోలెడంత కోపం వచ్చేసినప్పుడు, ఆ సిట్యుయేషన్ ని తేలిక చేయటానికి తెలుగులోకి డబ్బింగ్ అయిన సినిమాల్లో పాటలకి సాహిత్యంతో సంబంధం లేకుండా నటుల నోటి కదలికలు ఎలా ఉంటాయో చెప్పి చెప్పి అందరినీ నవ్వించినా మల్లి బాబాయే. "మ్రేప సోకమే లవలో డపిన పంపా సిపడువా" (ప్రేమ కోసమే వలలో పడెనే పాపం పసివాడు) అంటూ పాటల్ని తిరగేసి పాడినా, "హిల్ విలేజ్ కింగు హార్టు లుక్కరా బులక్కు ఓ బులక్కు" (కొండవీటి రాజా గుండె చూడరా) అంటూ తెలుగు పాటకి ఇంగ్లీషు రూపం ఇచ్చినా, మాయాబజార్ లో లంబుజంబులు మాటల్ని పొడి చేసి పిప్పి చేసినట్టుగా పాటల్ని తూట్లు పొడిచేసి, పొడి చేసి, పిప్పి చేసి పెట్టి పిల్లలమైన మా అందరినీ పడి పడి నవ్వించినా మల్లి బాబాయే. "ఈపాదం పుణ్యపాదం ....., నమో వేంకటేశా .... పాటలకి అనుకరణని అడిగి అడిగి చేయించుకుని, పడీపడీ నవ్వి, నవ్వలేక పొట్టలు పట్టుకునేవాళ్ళం. ఆ సందడికి, ఆనందానికీ కారణమైనా మల్లి బాబయ్...

ముప్ఫై ఏళ్ళ తర్వాత మళ్లీ... (క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి - 1వ భాగం)

"ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి" అని మాటల మాంత్రికుడు గారు అన్నారు కదా? ఏమిటో, నేను ఎక్కువసేపు పడుకున్నా, కాసేపే పడుకున్నా, కలలు వస్తాయి, అవి బాగా గుర్తుంటాయి కూడా. కలలు వస్తే, అవి గుర్తుంటే, అది సరైన నిద్రే కాదని డాక్టర్ల ఉవాచ. అంటే, "నీకేదీ చేత కాదు" అని ఎవరైనా నన్ను గట్టిగా తిడితే, ఆ చేతకాని పనుల జాబితాలో "సరిగ్గా నిద్రపోవటం" కూడా ఉందన్నమాట! ఇంతకీ అలా నాకు వచ్చే కలల కేటగిరీల్లో బాగా తరచుగా వచ్చేది "పరీక్షలు". సదరు "చదువుకొనుట" అనబడే పూర్వాశ్రమం ముగిసి 14-15 ఏళ్ళు కావస్తున్నా, "పరీక్షలు రాయుట" అనే బృహత్ కార్యక్రమం నిర్వహించుట అప్పటి నుండి ఒక్కసారీ జరగకపోయినా, ఆ కలలు నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి ఎందుకో! అందులోనూ మళ్లీ రకాలు ఉన్నాయండోయ్! ఒకోసారి పరీక్షలకి ఏమీ చదవనట్టు, ఇంకాసేపట్లో పరీక్ష అనగా ఆ విషయం నేను తెలుసుకున్నట్టు వస్తుంది. లేకపోతే పరీక్షకి ఆలస్యం అయిపోతున్నట్టు, ఎంత ఫాస్ట్ గా తొక్కుతున్నా సైకిల్ కదలనట్లు వస్తుంది. కలలోనే కాక బయట కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాను. ఒకోసారి కలల్లో తెగ ప్రిపేర్ అయిపోతూ ఉంటాను. స్టెప్పులు...