బ్లాగర్ కష్టాలు

తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు బ్లాగులు create చేసుకున్నాం అంటే "అబ్బో" అనుకున్నాను. అప్పటికి ఆ విషయంలో A-B-C-D కూడా తెలియవు మరి! అయితే నాకు ఈ విషయంతో పరిచయం ఏర్పడటానికి కొంత కథే ఉంది!

 ఈమధ్య చేతిలో సమయం మరీ ఎక్కువైపోయింది అనిపించటం మొదలుపెట్టింది. మా నాన్నగారి ప్రోత్సాహంతో ఆమధ్య రాసిన ఒక వ్యాసం నా స్నేహితురాలికి చూపిస్తే బాగుంది అంది. నా రచానాశైలి అటు బ్లాగులకీ చెందదు, ఇటు పత్రికల్లో అచ్చు అయ్యే పద్ధతిలోనూ ఉండదు. అయినా...ఆలోచించి అన్ని విధాలా నేను బ్లాగు మొదలు పెట్టటం కరెక్టు అనే నిర్ణయానికి వచ్చాను.

నా బ్లాగు title నాకు వెంటనే తట్టింది. అయితే...రంగులు, డిజైన్లు ఎంచుకుని నా పేజీ తీర్చిదిద్దటానికి రెండు గంటలు పట్టింది. తరువాత మొదటి వ్యాసం post చేయాలి. "ఏదో ఎందుకు? నేను ఇంతకు ముందు రాసిన వ్యాసం ఉందిగా? అది చేసేద్దాం." అనుకున్నాను. అసలే అది వినాయక చవితి సందర్భంగా రాసిన వ్యాసం. ఓంప్రదంగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు కూడా ఉంటాయనే ఉద్దేశంతో అది post చేసేశాను. ఇక మొదలయ్యాయి నా పాట్లు. నాకు ఉన్న ఇబ్బందే 'starting trouble'!!! రాయాలనే ఉంటుంది, ఏమి రాయాలో అర్థం కాదు. నా చిన్ననాటి సంఘటనలు, నా ప్రస్తుత పరిస్థితులు, నా బుర్రలో 'read-only' memory లో పదిలపరచబడిన జ్ఞాపకాలు......దేనితో మొదలు పెట్టాలి???

అసలు ఇవన్నీ కాదు...ఏమైనా కథలు రాద్దాం...అనిపించింది. దేని మీద రాయాలి? మళ్ళీ మొదటికొచ్చింది గొడవ! ఈ బ్లాగర్లు అందరూ అంత చకచకా ఎలా రాసేస్తున్నారో మరి!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్